Wednesday 7 November 2012

కాంప్ర మైజ్ మనసు

జరిగే ఆకృత్యాలను చూస్తే
 మనసు గాయపడింది
ఆలోచనలు వేడెక్కాయి
అడ్డు కోవాలనే 

తపన
ఆదు కోవాలనే 

ఆలోచన
ఏమి చెయ్యలేని

 నిస్సహాయత ...
తట్టుకోలేని గుండె
ఆగని జ్వాల
ఆరని ఎద మంట
ఎదురించ లేమా ?
అంతరాత్మ ప్రశ్న !?
ఏదో చెయ్యాలి 

..ఎలా... ఎలా ?
నిశీధి వైపు అడుగులేసింది మనసు
నిశితం గా ఆలోచించింది
వెలుగు నీడలు కనిపించాయి
నిశీధిలో నడుచుకుంటూ వెళ్లాను
కాని...!
అక్కడ కూడా ముళ్ళ బాటలే సుమా !
ఎక్కడ చూసినా పాత కధే !!!
అందుకే ఆలోచించడం మానేసాను
కాంప్ర మైజ్ ఆలోచనలు నేర్చుకున్నా!!?




అర్ధం లేని (కాని )ఆలోచనలు

పెట్రేగుతున్న ఆలోచనలు
మనసును అదిమి పడుతున్నాయి
ఏదో చెయ్యాలనే తపన
ఏమి చెయ్యాలో
 తెలీని ఆలోచనలు
కరువైన ప్రోత్సాహాలు
కన్నీటి దొంతరలు...
ఆశ,...నిరాశల మధ్య
 కొట్టుమిట్టాడుతున్న
జీవన పోరాటం
ఎదురీదే ఆరాటం
లక్ష్యం, గమ్యం
 ఒక్కటే!!!
నా ఆలోచనలు
 రెండు!!!
గెలవటం,
గెలిపించటం
 నాకు లక్షల మైళ్ళ దూరంలో
ఓటమి తొంగి చూస్తుంది

Wednesday 24 October 2012

మట్టి వాసన


ఎన్నాళ్ళు ఈ దోపిడీ తనం
ఎన్నేళ్ళు ఈ దొరల పెత్తనం
కోట్లు వాళ్ళవి ..
ఫీట్లు మనవి
మట్టి పని మనదిరా
గట్టి చేతులు మనవిరా
వట్టి చేతలు వాళ్ళవిరా !
ఎన్నాళ్ళు?! - ఇంకెన్నాళ్ళు?! 
రక్తం తో తడిసిన
ఎర్రజెండా స్ర్ముతులు
ప్రకంపనాలై
మేడే సాక్షిగా పిలుస్తున్నాయి
చిరిగిన జీవితం మాదిరా
చితికిన బతుకు మాదిరా
చికాగో పోరాటం మాదేరా
కలసి రండి
కదలి రండి
బూర్జవా వ్యవస్థను
కూకటి వ్రేళ్ళతో కూల్చేద్దాం !
కాల్చేద్దాం ..
శ్రమ శక్తిని నిరూపిద్దాం
మట్టి వాసన చూపిద్దాం
కార్మికలోకం
కర్షక లోకం
ఏకం కండి
కార్మికులారా ఏకం కండి
వర్దిల్లే ఐక్యత
చాటి చెబుదాం !!! 

తాకట్టు జీవితాలు

కూడు-గూడు -గుడ్డ లేని 
నా సంపూర్ణ పేదరికానికి 
తలసరి ఆదాయం లెక్క కట్టి 
సాపేక్ష పేదరికం లో నన్ను చేరిస్తే 
నా ఆకలి అన్నార్త నాదాలు 
తీర్చే వారెవరు ఎవరికెరుక ?
తప్పుల తడకల ఆర్ధిక వ్యవస్థలో 
ఏసి ల్లో కూర్చుని ఇచ్చే జివో ల్లో
ఎండమావుల జీవితాలే కనిపిస్తాయి
ఆర్ధిక జీవన ప్రమాణాలు 
తెలీని నీ బొక్కల లెక్కలు 
మా రెక్కల తాకట్టు పెట్టే
నీ ప్రపంచ బ్యాంకుకే పనికొస్తాయి. 
ఈ పనికిమాలిన ప్రవచనాలు 
దగ్గరకొస్తే నిజాలు ఇజాలవుతాయి
రూపాయికి విలువలేని ఈ దేశంలో
క్రూరమైన విధి విధానాలకు 
కొదువలేదు
అశాస్త్రీయ ఆర్దికమే నీకు నిజం
ఒక్కసారి మా ఆకలి చవి చూడు 
డొక్కాడని మా రెక్కలు చూడు 
చిరిగిన చితికిన జీవితాలు 
కనిపిస్తాయి
(ఈ కవిత సేవ పత్రికలో ప్రచురితం )